![]() |
![]() |
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -288 లో.....సుధా పాపని వెతకడానికి రుద్ర, రంగాని వెళ్ళమని పెద్దసారు చెప్తాడు. నేను కూడా వెళ్తానని గంగ అనగానే వద్దు నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి కదా అని పెద్దసారు అంటాడు. నేను రోజంతా ఏం ప్రాక్టీస్ చెయ్యట్లేదు కదా అని గంగ అంటుంది. నేను కూడా సుధా అమ్మ పాపని కనిపెడతానని గంగ అంటుంది. మీరు మీ చెల్లికి ఇచ్చిన మాట మేం నెరవేరుస్తామని గంగ అంటుంది. వాళ్ళ మాటలన్ని ఇషిక, వీరు వింటారు
ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఆ విశ్వకి కోట్లాది ఆస్తులున్నాయి.. అవి గంగకే సొంతం.. ఇప్పుడు వాళ్ళ పాపని వెతికే పనిలో పడ్డారు. ఇప్పుడు గంగనే సొంతకూతురు అనే విషయం ఎవరికి తెలియదు.. మనం గంగ ప్లేస్ లో ఒకమ్మాయిని తీసుకొని వచ్చి తనే సుధా కూతురు అని చెప్పాలని వీరు చెప్తాడు. మరొకవైపు సుధా, లక్ష్మి కలిసి వంటలు అన్ని ప్రిపేర్ చేస్తారు. ఏంటి ఇన్ని వంటలు చేసావ్.. ఏంటి స్పెషల్ అని విశ్వ అడుగుతాడు. గంగ, రుద్ర భోజనానికి వస్తున్నారని సుధా చెప్తుంది. వాళ్ళు వస్తూ వెళ్తుంటే ఏం అనట్లేదని మాటిమాటికి పిలుస్తున్నావ్ ఎందుకని విశ్వ కోప్పడతాడు. ఎవరు బాక్సింగ్ పోటీలో సెలెక్ట్ అయినా వాళ్ళని భోజనానికి పిలవడం మన అనవాయితీ అయింది కదండి.. వద్దంటే చెప్పండి.. ఇప్పుడే వద్దని చెప్తానని సుధా అంటుంది. అప్పుడే గంగ, రుద్ర, రంగా వస్తారు. అయ్యో వెళ్ళమని చెప్తానని సుధా అనగానే వచ్చిన వాళ్ళని ఎందుకు వద్దని చెప్పడం రానివ్వు అని విశ్వ అంటాడు.
ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. గంగకి మాత్రం ఉడకపెట్టిన సీడ్స్ పెడతారు. అమ్మగారు ఇక్కడ కూడా ఏంటి అని గంగ అడుగుతుంది. అప్పుడే విశ్వ ఒక స్వీట్ తీసి గంగకి ఇస్తాడు. ఇదొక్కటి తిను తిన్నాక వర్క్ ఔట్స్ చెయ్ అని విశ్వ అనగానే గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూసి రంగా మురిసిపోతాడు. మీ పాప గురించి ఏమైనా తెలిసిందా అని విశ్వని రుద్ర అడుగుతాడు. లేదని విశ్వ అంటాడు. ఆ తర్వాత గంగ మూతిని సుధా తన చీర కొంగుతో తుడుస్తుంది. అది చూసిన విశ్వ.. టిష్యూ ఉంది కదా అని కోపంగా అంటాడు. తల్లికి బిడ్డకి అలా ఏం ఉండదని సుధా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |